
‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అల్లు అర్జున్ స్టార్‌డమ్‌కి విపరీతమైన బూస్ట్ వచ్చింది. నూట యాభై కోట్ల రూపాయల షేర్‌తో ఈ చిత్రం బాహుబలియేతర చిత్రాల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. అల్లు అర్జున్‌కి ఫ్యామిలీస్, యూత్‌లో మంచి ఫాలోయింగ్ వుంది. అతని సినిమాకి వుండే పుల్ ఏమిటనేది ఈ చిత్రం నిరూపించింది. ఈ క్రేజ్‌ని ఇలాగే ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్టులను అల్లు అర్జున్ లైన్లో పెడుతున్నాడు. రాజమౌళి తనతో సినిమాయేమీ ప్లాన్ చేయడం లేదు. అయితే రాజమౌళి తర్వాత వున్న టాప్ లీగ్ డైరెక్టర్లు అందరినీ అల్లు అర్జున్ కాంటాక్ట్ చేస్తూ వారితో ప్రాజెక్టులు ఓకే చేసుకుంటున్నాడు. సుకుమార్‌తో ‘పుష్ప’ పూర్తి కాగానే కొరటాల శివ డైరెక్షన్లో అల్లు అర్జున్ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. కొరటాల శివతో చేయాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేసుకుంటోన్న అల్లు అర్జున్‌కి ఇప్పటికి కుదిరింది. అల్లు అర్జున్ మాత్రం ఏడాదికో సినిమా ఖచ్చితంగా వచ్చేలా చూసుకుంటున్నాడు.