
మహేష్ బాబు , రష్మీక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 11న రిలీజ్ అయింది. మహేష్ అన్నట్లుగా సరిలేరు నీకెవ్వరు 'బొమ్మ దద్దరిలిపోయింది'. ఒకరోజు గ్యాప్ తో అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల...వైకుంఠపురములో' జనవరి 12న రిలీజ్ అయింది. ఈ చిత్రం కూడా మొదటి షో నుంచి హిట్ టాక్ తో సాలీడ్ వసూళ్లు కనబరుస్తుంది. సంక్రాంతి అంటేనే సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. అలాంటిది ఈసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం, ఆ వచ్చిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో ప్రేక్షకుల ఆనందానికి అంతు లేదు. ఇకపోతే యూఎస్ లో రెండు సినిమాల తాజా కలెక్షన్స్ చూస్తుంటే రికార్డులు తిరగరాయటం ఖాయంగా కనిపిస్తుంది. సోమవారం నాటికి యూఎస్ లోని 93 లొకేషన్స్ లో సరిలేరు నీకెవ్వరు 21,400 డాలర్లను వసూలు చేయగా, మొత్తంగా 1.65 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది. మరో వైపు అల వైకుంటాపురములో 109 లొకేషన్స్ కి గాను 76,800 డాలర్లను కలెక్ట్ చేయగా, మొత్తంగా 1.50మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు సమాచారం. రాబోయే రెండు, మూడు రోజుల్లో 2మిలియన్ మార్క్ ను టచ్ చేయటం ఖాయమని తెలుస్తోంది.