‘అల…వైకుంఠపురములో’కు సిక్వెల్ ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ ?
4 years ago 1 min read

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్సకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన "అల..వైకుంఠపురములో' సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని దక్కించుకుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ఇది మూడో చిత్రం అవ్వడం, అది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం విశేషం. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర నిర్మాత అల్లు అర్జున్ తో కలిసి సూపర్ హిట్ బ్లాక్‌బస్టర్ అయిన 'అల..వైకుంఠపురములో'కు సీక్వెల్ చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి అల్లు అర్జున్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ సినిమా ఏదో విజయవంతమైన 'అల..వైకుంఠపురములో' సిక్వెల్ అయితే బాగుంటుందని నిర్మాత ఆలోచిస్తున్నారట. ఫ్యామిలీ డ్రామగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే ఫ్యాన్స్ ఈ సినిమా సిక్వెల్ చూడొచ్చు.