
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన "అల...వైకుంఠపురములో" సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ టాక్ దూసుకుపోతుంది. ఇక అల్లు అర్జున్ తదుపరి సినిమా సుకుమార్ తో రానున్న విషయం తెలిసిందే. సుకుమార్ తో కూడా బన్నీ చేయబోయే సినిమా మూడోవది అవ్వడం విశేషం. అల..వైకుంఠపురములో ఇచ్చిన సక్సెస్ జోష్ తో ఫిబ్రవరి నుంచి షూటింగ్ లో పాల్గొననున్నాడు. అయితే సుకుమార్ బన్నీ సినిమాలో తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి నటించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తున్న మిగితా హీరోల్ల సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్ర వస్తే చేస్తున్నాడు. తాజాగా సైరాలో తమిళ విరుడిగా కనిపించాడు. ఇక ఇప్పుడు బన్నీ సినిమాలో కనిపించబోతున్నాడనేసరికి అంచనాలు నెలకొన్నాయి. కాగా విజయ్ సేతుపతి బన్నీకి విలన్ గా చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తున్న సమాచారం. ఇదే కనుక నిజం ఐతే విజయ్ మరియు బన్నీ ల మధ్య నడిచే రైవల్ డ్రామా ఓ రేంజ్ లో తెరపై పేలడం ఖాయం.