
"అల.. వైకుంఠపురములో" విడుదలైన తరువాత, అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రముఖ హోస్ట్ అనుపమ చోప్రా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో, బాలీవుడ్లో సినిమా చేయాలనుకుంటున్నానని అల్లు అర్జున్ పదేపదే చెప్పాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుదలైన తన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో' యొక్క విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇది నాన్ బాహుబలి ఇండస్ట్రీ హట్ గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ రికార్డులను సృష్టించింది. అయితే, ప్రమోషన్లో భాగంగా అల్లు అర్జున్ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో, ముంబైలో మీకు ఇల్లు ఉందా అని అడిగిన ప్రశ్నకు "నాకు ముంబై అంటే చాలా ఇష్టం. అందుకే తరుచు వస్తుంటాను. నాకు ఇక్కడ ఇల్లు లేదు. నేను వచ్చి ఉండేది గీతా ఆర్ట్స్ గెస్ట్ హౌస్, నా సొంత ఇల్లు కాదు. కానీ ఇప్పుడు ముంబైలో ఇల్లు కొనుకోవాలని అనుకుంటున్నాని" సమాధానం ఇచ్చాడు.