మెగా కాంపౌండ్ లో జరిగిన ఈవెంట్ కు డుమ్మా కొట్టిన అల్లు అర్జున్, ఎన్టీఆర్.. కారణం ?
4 years ago

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కట్టించిన కొత్త ఇంట్లో రామ్ చరణ్, ఉపాసన దంపతులు వైల్డ్ లైఫ్ డ్రీమ్స్ అనే ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, నాగార్జున, అఖిల్, సమంత, మంచు లక్ష్మి, శృతిహాసన్ ఇలా టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఇద్దరు బడా స్టార్లు మాత్రం మిస్ అయ్యారు. వారే...అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు విబేధాలు పెరిగాయా అంటూ పుకార్లు మొదలయ్యాయి. అందుతున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ తన అప్ కమింగ్ సినిమా "అల...వైకుంఠపురంలో" విఎఫ్ఎక్స్ పనుల కోసం దుబాయ్ వెళ్లాడట. మరో పక్క ఎన్టీఆర్ ఒక యాడ్ టెస్ట్ షూట్ కోసం వేరే సిటీకి వెళ్లాడట. ఇద్దరు ప్రొఫెషనల్ గా బిజీ ఉండటం వల్ల రాలేకపోయారని లేకపోతే తప్పకుండా వచ్చేవారని తెలుస్తోంది.