
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'అల..వైకుంఠపురంలో' బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ కొట్టిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ప్రస్తుతం లెక్కల డైరెక్టర్ సుకుమార్ తో కలిసి 'పుష్ప' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. గుబురు జుట్టు, గడ్డం. బల్క్ బాడీ పెంచి ఫుల్ మాస్ గా కనిపిస్తున్నారు. కరోనా దృశ్య షూటింగ్ బ్రేక్ ఇచ్చిన బన్నీ తన కుటుంబ సభ్యులతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా కుటుంబంతో దసరా పండుగను జరుపుకున్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కుటుంబంతో కలిసి ఒక ఫోటోను పెట్టి అభిమానులకు పండుగ శుభాకాంక్షలు చెప్పాడు. బన్నీ పెట్టిన ఫ్యామిలీ పిక్ చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఇద్దరు బుడతలు ట్రెడిషనల్ దుస్తుల్లో బలే ఉండగా బన్నీ మరియు అతని సతీమణి శర మామూలుగానే స్టైలిష్ గా ఉన్నారు. ఈ ఫోటో పెట్టిన కొద్దిసేపటికే వేల లైకులు, లక్షల షేర్లు వచ్చాయి.