
నేడు అల..వైకుంఠపురములో స్టార్ అల్లు అర్జున్ మరియు అతని భార్య అల్లు స్నేహ రెడ్డి తమ తొమ్మిదోవ పెళ్లి రోజును జరుపుకుంటున్నారు. వీరి వివాహం 2011 సంవత్సరంలో జరిగింది. మార్చ్ 6వ తేదీ మొత్తం అల్లు కుటుంబానికి మరపురాని రోజు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు అతని లేడీలవ్ స్నేహ రెడ్డిని పెళ్లాడిన రోజు. వారి తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా, బన్నీ తన పెళ్లి రోజున దిగిన ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "తొమ్మిదేళ్ల వివాహ జీవితం. టైమ్ తొందరగా గడుస్తున్నా..ప్రేమ మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది" అంటు పెళ్లి నాటి ఫోటో పెట్టి భార్యకు స్వీట్ మెసేజ్ ఇచ్చాడు బన్నీ. అసలు ఈ కధ ఎలా మొదలైందంటే, తన స్నేహితుడి వివాహంలో స్నేహను మొదటి చూపులోనే ప్రేమంచాడు. కొన్ని నెలల తరువాత, అల్లు అర్జున్ తన స్నేహితుడి నుండి ఆమె నంబర్ తీసుకొని ఆమెతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. అల్లు అర్జున్ మరియు స్నేహ కొన్నాళ్ల డేటింగ్ తరువాత మూడు ముళ్లతో ఒకటయ్యారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్నేహ తండ్రిని వివాహం గురించి సంప్రదించినప్పుడు, అతను మొదట దానిని తిరస్కరించాడు. అయితే, తరువాత వారి వివాహానికి అంగీకరించారు. అల్లు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు..అల్లు అయాన్ మరియు అల్లు అర్హా.