
2021 లో కూడా బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు, అల్లు అర్జున్ పోటీ పడతారని ఇంతకు ముందే అంతా భావించారు. 2020 సంక్రాంతి భరిలో, వారి సినిమాలు 'సరిలేరు నీకెవ్వరు' మరియు 'అల... వైకుంఠపురములో' పోటీ పడ్డాయి మరియు రెండు సినిమాలు హిట్ అయ్యాయి. రెండు సినిమాలు భారీగా వసూలు చేయడంతో, ఈ చిత్రాల పంపిణీదారులు ఎవ్వరు పోటీ మూలంగా నష్టపోలేదు. అయితే మహేష్ బాబు, ఇంకా ఏ సినిమాను ఫైనల్ చేయకపోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ తప్పినట్లు కనిపిస్తోంది. మహేష్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య'కు తేదీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ తన మామతో పోటీ పడటానికి ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రాడు. అందుకని అల్లు అర్జున్ సుకుమార్ కు, సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ కల్లా ముగించమని గడువు ఇచ్చాడట. అలా అయితే సేఫ్ గా 2020 దసరాకు రిలీజ్ చేయొచ్చని అల్లు అర్జున్ ప్లాన్. మరి సుక్కు ఏం చేస్తాడో చూడాలి.