
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్నేహ దంపతులకు అల్లు అయాన్ మరియు అల్లు అర్హా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసిందే. అల్లు అయాన్ స్కూల్ కు కూడా వెళ్తున్నాడు. నిన్న, అల్లు అయాన్ యొక్క ప్రీ-స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకల సందర్భంగా, అల్లు అర్జున్ తన ట్విట్టర్లో తన కొడుకు గురించి సుదీర్ఘ ట్వీట్ రాశారు. అల్లు అర్జున్ ట్వీటర్ లో “అయాన్ ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలు. అల్లు అయాన్ ఇంత బాగా రాణించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. తల్లిదండ్రులుగా ఈ పాఠశాలలో చేర్చడం ద్వారా మంచి ఎంపిక చేసుకున్నామని" ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు అల్లు అయాన్ యొక్క ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఫొటోలో అయాన్ సూటూ, బూటూ వేసుకొని హుందాగా క్యూట్ గా ఉన్నాడు. ఇకపోతే అల్లు అర్జున్ తాజాగా అల..వైకుంఠపురములో సినిమా అందించిన హిట్ తో ఫుల్ జోష్ ఉన్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు.