
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'అల...వైకుంఠపురంలో' బహుబలియేతర ఆల్ టైం హిట్ గా నిలిచింది. అలాంటి భారీ విజయం సాధించిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాను మొదలుపెట్టాడు. అయితే కరోనా వైరస్ వ్యాపించడంతో షూటింగ్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బన్నీ, భార్య స్నేహతో కలిసి వాకింగ్లు, జాగింగ్లు చేస్తూ కనిపిస్తున్నాడు. తాజాగా సిటీ ఔట్ స్కర్ట్స్ లో భార్యతో కలిసి సరదాగా వాక్ చేస్తూ కామెరాకు చిక్కాడు. ఆ ఫోటోలు చూస్తే అర్ధం అవుతుంది అల్లు అర్జున్ లుక్ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని. గుబురు రింగుల జుట్టు, బల్క్ బాడీ, గడ్డంతో ఉరమాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఎంతో భిన్నమైన కొత్త లుక్ లో బన్నీ కనిపిస్తున్న ఈ ఫోటోలు ఇప్పుడు నెటింట వైరల్ అవుతున్నాయి.