
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్రెండ్ ను ఫాలో ఎవ్వడు సెట్ చేస్తాడని అందరికి తెలిసిందే. అయితే టాలీవుడ్ లోకి రీసెంట్ గా ఇచ్చి సెన్సేషనల్ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండను జూ.స్టైలిష్ స్టార్ అంటారు. కారణం, విజయ్ కూడా ట్రెండ్ ఫాలో ఎవ్వడు సెట్ చేస్తాడు. అయితే విజయ్ దేవరకొండ 'రౌడీ' అనే దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి బుధవారం ఒక కొత్త రకమైన దుస్తులను పరిచయం చేస్తాడు మిస్టర్ దేవరకొండ. అయితే అలా..ఈ వారం ఒక కొత్త రకమైన దుస్తులను విజయ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు పంపడం జరిగింది. దాన్ని బన్నీ ధరించి ఫోటోలు దిగి 'థాంక్ యు మై బ్రదర్ విజయ్' అంటూ పోస్ట్ పెట్టాడు. ఆ ఫోటోల్లో అల్లు అర్జున్ స్టైలిష్ గా అల్ట్రా కూల్ లుక్స్ తో అదిరిపోయాడు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.