
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం "అల.. వైకుంఠపురంలో" జనవరి 12న రిలీజ్ అవుతుండగా... అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మీక మందన్న జంటగా తెరకెక్కుతున్న "సరిలేరు నీకెవ్వరు" చిత్రం జనవరి 11న రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడనున్నాయి. అయితే ఈ రెండు సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లు జనవరి 5న ఖరారు చేసారు. సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. ఇటుపై అల..వైకుంఠపురంలో టీం ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శకుడు రాజమౌళి, హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ ను కూడా అతిధులుగా రమ్మని ఆహ్వానించగా... వచ్చేందుకు వాళ్ళు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు మా హీరో ఆర్ఆర్ఆర్ ను తీస్కొస్తున్నాడని సంబర పడిపోతున్నారు.