
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొంచెం గ్యాప్ తీసుకున్నప్పటికీ 'అల..వైకుంఠపురంలో' సినిమాతో ఆ గ్యాప్ ను భర్తీ చేసాడు. బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన బన్నీ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తో 'పుష్పా' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఐకాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇకపై గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేయాలనీ ఫిక్స్ అయినా బన్నీ వరుసగా సినిమాలు లైన్ అప్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం సోషల్ మెసేజ్లతో సినిమాలు తీసి ఇప్పటి వరకు ప్లాప్ చూడని డైరెక్టర్ కొరటాల శివతో బన్నీ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ కాంబోలో సినిమా రాబోతుందని వార్త రావటంలో అల్లు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని సంబరపడుతున్నారు. మరి దీని అధికారిక ప్రకటన కోసం వేచి చూద్దాం.