
కరోనా మహమ్మారి ఎవరిని వదల్లేదు. అందరిని ఇంటికే అంకితం చేసింది. అందరి ప్లాన్లు అటకెక్కాయి. అందులో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే హీరోలు, హీరోయిన్లు ఈ సమయాన్ని వారికి నచ్చిన పనులు చేస్తూ గడుపుతున్నారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ గా హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలో అల్లు అర్జున్ కంప్లిట్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. పెరిగిన జుట్టు, గడ్డంతో రఫ్ గా సాలిడ్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇకపోతే అల్లు అర్జున్ 'అల..వైకుంఠపురంలో' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్బాస్టర్ ఇచ్చి ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ తో జతకట్టాడు. వీరి కాంబోలో రాబోతున్న మూడో సినిమా అవ్వటంతో భారీ క్రేజ్ నెలకుంది. ఈ సినిమాకు 'పుష్పా' అనే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను సైతం యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభించింది. మరి ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో సినిమాల షూటింగ్లు ఎప్పుడు మొదలవుతాయో చూడాలి.