
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన "అల..వైకుంఠపురములో" సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాన్ బాహుబలి రికార్డులను సాధించి, అల్లు అర్జున్ కెరీర్ లొనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత చాలా కాలం ఎదురుచూసి మంచి ఫ్యామిలి ఎంటర్టైనర్ చెయ్యాలని ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే గ్యాప్ తీసుకున్న సమయంలో గీతా ఆర్ట్స్ బన్నీతో 'సోను కె టిటు' అనే హిందీ సినిమా రీమేక్ చేయాలని, రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ రీమేక్ ను చెయ్యమని బన్నీ త్రివిక్రమ్ ను అడగగా, రీమేక్‌లు తీయటం ఇష్టం లేని త్రివిక్రమ్ కొంచెం టైమ్ తీసుకొని అల..వైకుంఠపురములో సినిమాతో వచ్చాడు. అలా, బన్నీ ఈ సినిమాను చేయటం జరిగింది. ప్రస్తుతం బన్నీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి, రీమేక్ రైట్స్ కొనుకున్న గీతా ఆర్ట్స్ ఏ హీరోతో ప్లాన్ చేస్తుందో చూడాలి.