
జేఎన్యూ లో అతి కిరాతకంగా స్టూడెంట్స్ ను కొట్టిన సంఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున నిరసనలు, నినాదాలు వెల్లువెత్తుతున్నాయి. సెలెబ్రిటీలు కూడా జరిగిన ఘటనపై, జరుగుతున్న పరిణామాలపై తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా జేఎన్యూ ఘటనపై స్పందించారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల..వైకుంఠపురంలో సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో ముచ్చటించిన బన్నీను సీఏఏ గురించి జరుగుతున్న నిరసనలపై మీ స్పందన ఏంటని అడగగా....."జరుగుతున్నవి చాలా బాధాకరం. త్వరలో ఒక శాంతివంతమైన, అందమైన పరిష్కారం లభిస్తుందని కోరుకుంటున్నానని" తెలిపారు. అలానే, "మేము నటులము మాకు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఏమి మాట్లాడ్తున్నాము అనేది గ్రహించుకొని మాట్లాడాల్సి ఉంటుంది....ఎందుకంటే మేము మాట్లాడే దానిపై ప్రభావం ఉంటుందని" తెలిపారు.