
అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "అల..వైకుంఠపురములో" మ్యూజికల్ కాన్సర్ట్ నిన్న హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ....."మా నాన్న గురించి నేను, నా గురించి మా నాన్న ఏ రోజు చెప్పుకోలేదు. కానీ నేను మా నాన్నకు థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థాంక్యూ నాన్న. ఇది నాతో సినిమా చేసినందుకు కాదు. నాకు ఒక కొడుకు పుట్టాక అర్ధం అయింది, నేను మా నాన్న అంత గొప్పగా ఎప్పటికి కాలేనని. కనీసం మా నాన్నలో సగం ఎత్తుకు ఎదిగితే చాలు అనిపిస్తుంది. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నాన్నే. ఆర్య సినిమాకే కోటి రూపాయిలు వచ్చాయి. తర్వాత నా భార్యకు చెప్పాను ఎన్ని కోట్లు వచ్చినా నేను మా నాన్నతోనే ఉంటాను..ఆయన అంటే నాకు అంత ఇష్టం. ఇండస్ట్రీకి నాన్న ఎంతో చేశారు. ఎంత నిజాయితీగా కష్టపడకపోతే ఈరోజుకి కూడా నెంబర్.1 ప్రొడ్యూసర్ గా కొనసాగుతారు. అందుకే మా నాన్న పద్మశ్రీకి అర్హుడని భావిస్తున్నాను. కాబట్టి మా నాన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని సభావేదిక నుండి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇండస్ర్టీకి ఎంతో చేసిన ఆయన ఆ అవార్డుకు అర్హుడు" అని ఎమోషనల్ గా అన్నారు.