
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన 'అల..వైకుంఠపురంలో' సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలుసు. అల్లు అర్జున్ కు మిగితా ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది. దిని తర్వాత బన్నీ మంచి లైనప్ ను సెట్ చేసుకున్నప్పటికి లెక్కల డైరెక్టర్ సుకుమార్ తో 'పుష్ప' సినిమాను మొదట చేసి రిలీజ్ చేయనున్నాడు. వీరి కలయికలో రాబోయే మూడో సినిమా ఇది. అందుకే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఆ అంచనాలకు తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తూనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే మంచి జోరు మీద సాగాల్సిన షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అన్ని యధావిధిగా తేర్చుకోవడంతో షూటింగ్ డేట్, ప్లేస్ ఫిక్స్ చేశారు. ముందుగా అనుకున్న ప్రకారమే ఈ సినిమాను కేరళ అడవుల్లో కాకుండా.. విశాఖ పట్నం, తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రంపచోడవం అడవుల్లో నవంబర్ 5న ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎడతెరిపి లేకుండా షూటింగ్ జరుగుతుందని సుకుమార్ ముందుగానే టీంకు చెప్పి ఆ దిశగా అన్ని ప్లాన్ చేయమని సూచించారు.