
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- అల్లు స్నేహల జంట ఎంత చుడముచ్చట్టగా ఉంటుందో. అయితే నిన్న అల్లు స్నేహ 35వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈమేరకు అల్లు అర్జున్ భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. 28న అల్లు వారి కుటుంబ సబ్యులకు మరియు స్నేహ దగ్గరి స్నేహితులకు గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసిన అల్లు అర్జున్ స్నేహ పుట్టిన రోజును గోవాలో ప్లాన్ చేశాడు. అయితే భార్య స్పెషల్ డే రోజు బన్నీ గోవాలో ఎన్నో స్పెషల్ ఏర్పాట్లు చేసి దాని కోసం భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తుంది. అల్లు దంపతులకు దగ్గరి స్నేహలతతో గోవాలో ఒక పెద్ద లగ్జారీ విల్లాలో స్నేహ పుట్టినరోజు ఘనంగా జరిగింది. వైట్ దుస్తుల్లో అల్లు అర్జున్- స్నేహ ఎప్పటిలానే స్టైలిష్ గా ఉండగా....భార్యకు ఇష్టమైన ఒక మ్యూజిక్ బ్యాండ్ ను అల్లు అర్జున్ గోవాకు పిలిపించారు. ఇలా అల్లు స్నేహ బర్త్ డేను మరింత స్పెషల్ గా మార్చేందుకు బన్నీ సుమారు 25 లక్షలు ఖర్చుపెట్టినట్లు సమాచారం.