
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అల్లు వారసుడు అల్లు అర్జున్ ను మొదట ఎంతోమంది అవమానించారు, హేళన చేసారు. ఇతను హీరోనా? ఎవరైనా చూస్తారా? ఇలా ఎన్నో మాటలు. కానీ వాటిని తన బలంగా మార్చుకొని తనని తాను మార్చుకుంటూ సినిమా సినిమాకి మారుతూ, నిరూపించుకుంటూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నాడు. కష్టే ఫలి...అన్నదానికి అల్లు అర్జున్ నిదర్శనంగా మారారు. అయితే తన స్టాఫ్, ఫ్యాన్స్ విషయంలో అల్లు అర్జున్ ఎంతో ఆలోచిస్తాడు. వాళ్లకు ఏదైనా అవసరం వస్తే ముందుకొచ్చి నిలబడతాడు. అల ఎన్నో సార్లు బన్నీ తన స్టాఫ్ పుట్టినరోజు వేడుకలను జరపడం చూశాం. ఇప్పుడు మరోసారి తన టీంలోని ఒక వ్యక్తికి సర్ప్రైజ్ బ్యాచేలరేట్ పార్టీని ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అందుకే మా హీరో గొప్పవాడంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
Tags: #AA #AlluArjun #Cinecolorz #Tollywood