
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల...వైకుంఠపురంలో' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను బుట్టలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం తన ఆర్య డైరెక్టర్ సుకుమార్ తో 'పుష్ప' చిత్రంలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ ఒక సినిమా పూర్తికాకముందే మూడు, నాలుగు సినిమాలని లైన్ అప్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో యాత్ర డైరెక్టర్ మహి వి రాఘవ బన్నీ కి ఒక లైన్ వినిపించాడట. ఆ లైన్ బన్నీకి బాగా నచ్చి మొత్తం కథను సిద్ధం చేయమని చెప్పాడట. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించిననున్నట్లు మొత్తం రాజకీయాల నేపధ్యంలో సాగనున్నట్లు తెలుస్తుంది. అది కూడా ఇప్పటి పరిస్థితులను ఉద్దేశిస్తూ ఉంటుందనే సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో!