
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల...వైకుంఠపురంలో' సినిమా బాహుబలియేతర సినిమాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు కూడా అన్నీ సిద్ధం అయ్యాయి. అయితే ఈ సినిమా ఇంతటి సక్సెస్ సాధించడంతో పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తెరకెక్కించాలనే ఆలోచన పడిందట అల్లు అర్జున్ కు. స్టైలిష్ స్టార్ కు కేవలం టాలీవుడ్ లోనే కాక అటు మలయాళం ఇండస్ట్రీలోను, బాలీవుడ్ లోను మంచి క్రేజ్ ఉంది. దీంతో ప్రభాస్ లాగా నేను కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తే మార్కెట్ పెరుగుతుందనే ఆలోచన చేస్తున్నాడు అల్లు అర్జున్. మరి ఈ ఆలోచన ఎంతవరకు కార్యాచరణ లోకి వస్తుందో చూడాలి.