
అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన 'అల...వైకుంఠపురములో' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై చారిత్రాత్మక విజయం సాధించడంతో ఆనందంగా ఉన్నాడు. ఈ చిత్రం దాదాపు 145 కోట్ల రూపాయల ప్రపంచ షేర్ ను వసూలు చేసింది. నాన్ బాహుబలి2 రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. అయితే సినిమా గ్రాండ్ సక్సెస్ అయినందుకు ఈ శుక్ర, శనివారల్లో రెండు పార్టీలను నిర్వహించబోతున్నట్లు అల్లు అర్జున్ నిన్న సక్సెస్ మీట్లో ప్రకటించారు.
పరిశ్రమల దిగ్గజాలు, సహచరులు మరియు అల.. వైకుంఠపురములో సభ్యులకు శుక్రవారం బన్నీ ఆతిథ్యం ఇవ్వనుండగా, బన్నీ నివాసంలో శనివారం చిత్రం విడుదలైనప్పటి నుండి భుజం మీద వేసుకున్న మీడియా సిబ్బంది కోసం ప్రత్యేకంగా పార్టీ ఇవ్వనున్నారు. ఈ చిత్రం భారీ విజయాన్నికి మీడియా ముఖ్య కారణమని బన్నీ కొనియాడారు.