
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన ‘అల... వైకుంఠపురములో’ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామ ‘అల.. వైకుంఠపురములో’ నాన్ బాహుబలి రికార్డులను సాధించిన సినిమాగా అగ్ర స్థానంలో నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ న్యూస్కాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియాకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఫిల్మ్ న్యూస్కాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆఫీసు మెంబర్స్ ‘అల.. వైకుంఠపురములో’ విజయవంతం అయినందుకు అల్లు అర్జున్ ను అభినందించడానికి వెళ్ళినప్పుడు... బన్నీ, అసోసియేషన్ యొక్క కార్యకలాపాలను ఇష్టపడుతున్నారని చెప్పారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “నా ఆర్థిక సహకారాన్ని రూ.10 లక్షలు ప్రశంసల చిహ్నంగా అంగీకరించండి. భవిష్యత్తులో కూడా మీ అసోసియేషన్‌కి ఎటువంటి సహాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను" అని తెలిపారు.