
అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "అల..వైకుంఠపురములో" సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం టాలీవుడ్లో నాన్ బాహుబలి హిట్‌గా నిలిచింది. స్టైలిష్ స్టార్ తదుపరి చిత్రం, అతని ఆర్య దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాలో నటించనున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఫిబ్రవరిలో సుకుమార్ చిత్రం షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఏదేమైనా, అతను తన కుటుంబంతో మరికొంత సమయాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతను మార్చిలో మాత్రమే షూట్లో చేరబోతున్నానని తన దర్శకుడికి చెప్పాడు. అల.. వైకుంఠపురములో యొక్క విజయంతో ఆ విజయానికి ఏ మాత్రం తగ్గకుండా లేదా అంతకు మించి రావాలని ఒత్తిడి తీసుకోవద్దని, తనదైన శైలిలో పని చేయమని బన్నీ సుకుమార్‌కు చెప్పాడు. బన్నీ- సుకుమార్ ది కూడా ఇది హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.