
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎప్పటి నుంచో మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో' విడుదలైన తరువాత, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపించాడు. అతను అల్లు అర్జున్ నటనను అప్రయత్నంగా మరియు అద్భుతమైనదిగా పేర్కొన్నాడు. అల్లు అర్జున్ జూ. ఎన్టీఆర్ ను బావగా పేర్కొంటూ ఎన్టీఆర్ ట్వీట్ కు బదులిస్తూ పెట్టిన ట్వీట్లు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మీడియా సమావేశంలో బన్నీ మరోసారి ఎన్టీఆర్ కు థాంక్స్ చెప్పాడు 'నా బావ జూ. ఎన్టీఆర్ అందించిన ప్రోత్సాహానికి మరోసారి అందరి ముందు థాంక్స్ చెప్తున్నాను' అని తెలిపాడు. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ తెలుగు సినిమాకే గర్వ కారణమని, ఎందుకంటే కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ నుండి ప్రముఖులు ఫోన్ చేసి మరీ ప్రశంసలు కురిపించారని బన్నీ అన్నాడు.