
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా ఏదైనా రిలీజ్ అయితే థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో చూసేవాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోలలో అలా థియేటర్లకు వెళ్లి చూసేవాళ్లలో బన్నీ మొదటి ప్లేస్ లో ఉంటాడు. ప్రేక్షకులతో పాటు సినిమాలు చూడటం మరియు వారి రెస్పాన్స్ ను వినడం బన్నీకి చాలా అలవాటు. అల్లు అర్జున్ ఎటువంటి హంగమా లేకుండా థియేటర్లకు వెళ్లి సినిమా ప్రేక్షకులతో సినిమా చూస్తాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పష్టంగా తెలియజేశారు. సినిమా చూడటానికి అల్లు అర్జున్ థియేటర్లకు వెళ్ళినప్పుడల్లా తన లగ్జరీ కారులో అక్కడికి వెళ్లడు. దానికి బదులుగా, అతను తన స్నేహితుల్లో ఎవరిదైన కారు తీసుకుంటాడు. ఇటీవల అల్లు అర్జున్ తన భార్య స్నేహతో కలిసి ‘అల...వైకుంఠపురములో’ స్క్రీనింగ్ కోసం సంధ్య థియేటర్‌కు వెళ్లి నిశ్శబ్దంగా ప్రేక్షకులతో సినిమా చూశారు. బయటకు వచ్చే సమయంలో మాత్రం అభిమానులు గుర్తుపట్టి అల్లు అర్జున్ ను చూసేందుకు ఎగబడ్డారు.