
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన 'అల..వైకుంఠపురములో' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లను సాధిస్తూ నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొడుతుందంటే దానికి కారణం దర్శకుడు త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లతో పాటు సినిమాలో అల్లు అర్జున్ నాన్న వాల్మీకి పాత్రలో నటించిన మురళి శర్మకూ అంతే క్రెడిట్ దక్కుతుంది. ప్రతి ఫ్రెమ్ లో తన ఎక్స్ప్రెషన్ ను కారీ చేస్తూ పాత్రలో ఒదిగిపోయాడు. అంత మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన మురళి శర్మ మాత్రం సినిమా సక్సెస్ మీట్, సెలెబ్రేషన్స్ లో కనిపియట్లేదు. దానికి కారణం లేకపోలేదు..సినిమాకు అతను 50 రోజుల కాల్ షీట్ కేటాయిస్తే అది కాస్త 80 రోజులకు పొడిగించారు. కానీ రెమ్యునరేషన్ మాత్రం ముందుగా మాట్లాడుకున్నట్లు 50 రోజులకే ఇచ్చారట. దీంతో యూనిట్ పై కోపంతో సక్సెస్ మీట్స్ కు డుమ్మా కొట్టారని తెలుస్తోంది.