
అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన 'అల...వైకుంఠపురములో' రిలీజ్ కు సిద్ధం అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా U/A సెన్సార్ లభించింది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అర్హకు సంబంధించిన వీడియో కానీ ఫోటో కానీ పోస్ట్ చేస్తే చాలు నిమిషాల్లో వేల కొద్ది లైక్స్ వస్తాయి. మొన్నమొన్ననే ఆ సినిమాలోని ఓ ఎంజీ డాడీ అంటూ అలరించింది. ఇక ఇప్పుడు నాన్న వేసిన రాములో రాముల స్టెప్ ను దోసా స్టెప్ అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ఒళ్ళో కూర్చొని నాన్నతో నువ్వు దోసా స్టెప్ వేస్తావ్ అనగానే...అర్జున్ వేసి చూపిమనడంతో .....చిన్న చేతులతో ఆ స్టెప్ వేసి చూపించింది. ఇక అర్హ క్యూట్ స్టెప్ చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.