
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన "అల..వైకుంఠపురములో" సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులను సృష్టించింది. ఇప్పటికి రికార్డులను కొనసాగిస్తూనే ఉంది. ఈ సినిమాలోని 'సామజవరగమన' పాట అతి తక్కువ సమయంలోనే 100మిలియన్ వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని మరో పాట కూడా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అదే అనురాగ్ కులకర్ణి పాడిన 'రాములో రాముల' పాట యూట్యూబ్ లో 200మిలియన్ వ్యూస్ సాధించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే, సుశాంత్, నివేత పేతురాజ్ అదిరిపోయే స్టెప్పులతో, మాస్ బిట్ తో ఆకట్టుకునే ఈ పాట యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తుంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా స్టైలిష్ స్టార్ కెరియర్ లొనే అత్యంత వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.