
అల్లు రామలింగయ్య 99వ జయంతిని పురస్కరించుకుని అల్లు కుటుంబం ఈ రోజు హైదరాబాద్లో అల్లు స్టూడియోస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు సిరిష్, అల్లు వెంకటేష్ పాల్గొన్నారు. అల్లు స్టూడియోస్ పెద్ద ఎత్తులో ఫిల్మ్ షూటింగ్స్ జరుపుకునే స్టూడియోగా ఉంటుందని అల్లు అరవింద్ తెలిపారు. అల్లు అరవింద్ ఇప్పటికే గీతా ఆర్ట్స్ అనే ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ను నడుపుతున్నారు. ఈ రోజు కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ స్టూడియోస్ లో అత్యాధునిక సౌ9 మరియు టెక్నాలజీని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో వారు దీని గురించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్, మరియు రామానాయుడు స్టూడియోస్ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న పెద్ద షూటింగ్ స్టూడియోస్. ఇప్పుడు ఈ జాబితాలో అల్లు స్టూడియోస్ కూడా చేరనుంది.