
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో అరంగ్రేటం చేయనున్న సంగతి తెల్సిందే. ఆ మెగా హీరో మరెవరో కాదు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు విష్ణు తేజ్. 'ఉప్పెన' సినిమాతో త్వరలో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుండి రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ , సాయి ధరమ్ వంటి హీరోలు వచ్చి తమదైన ముద్ర వేసి గుర్తింపు పొందారు. ఇప్పుడు విష్ణు తేజ్ కూడా తనదైన రీతిలో ప్రేక్షకులను మెప్పించేందుకు రాబోతున్నాడు. అయితే విష్ణు తేజ్ నటిస్తున్న "ఉప్పెన"సినిమా కథ, అల్లు శిరీష్ నటించిన "గౌరవం"కు చాలా దగ్గరగా ఉంటుందట. గౌరవం కధ పరువు హత్యలపై సాగుతుంది. అదే తరహాలో విష్ణు తేజ్ ఉప్పెన కధ ఉంటుందని సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంతే కొంత సమయం వేచి చూడాల్సిందే.