
ఈ నిమిషం వరకు మెగా వారి ఇంట్లో జరిగిన మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి మర్చిపోలేకపోతున్నారు నెటిజన్లు...ఎందుకంటే అంత గ్రాండ్ గా జరిగింది. అంతే కాకుండా ఆ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే నిహారిక పెళ్లి జరిగి వారం కూడా అవుతుందో లేదో ఇప్పుడు ఇంకో పెళ్లి కబురు వైరల్ అవుతుంది. అయితే అది మెగా కుటుంబంలో కాదు కానీ అల్లు వారి కుటుంబంలో కానీ ఈ కబురు చెప్పింది మాత్రమే మెగా హీరోనే. మెగా ఫ్యామిలీలో ఉన్న బ్యాచిలర్స్ వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్‌ల పెళ్లి గురించి చర్చ మొదలైంది. ఇందులో భాగంగా సాయిధరమ్ తేజ్‌ని ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీలో తర్వాతి వేడుక ఎవరిది అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం ఇచ్చిన సాయి.. వచ్చే ఏడాది అల్లు శిరీష్ ఓ ఇంటి వాడు కానున్నాడు అని బదులిచ్చాడు. కాబట్టి అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని క్లారిటీ వచ్చేసింది.