
7 సంవత్సరాల క్రితం అరంగేట్రం చేసిన యంగ్ మెగా హీరో అల్లు సిరిష్ టాలీవుడ్లో తనదైన ముద్ర వేయడానికి చాలా కష్టపడుతున్నాడు. కెరీర్ వ్యవధిలో సిరీష్ కేవలం 5 సినిమాలు మాత్రమే చేసాడు. వాటిలో 2 మాత్రమే యావరేజ్ చిత్రాలుగా నిలిచాయి, మిగిలిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 'ఒక్క క్షణం' ప్లాప్ అయిన తరువాత, అల్లు సిరిష్ భారీ గ్యాప్ తీసుకొని మలయాళ చిత్రంను 'ఎబిసిడి' టైటిల్ తో రీమేక్ చేసాడు. అది కూడా జాడ లేకుండా పోయింది. ఈ ప్లాప్ తరువాత, అల్లు సిరిష్ మరే ఇతర ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. అల్లు సిరిష్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం గ్రౌండ్ వర్క్ ను సిద్ధం చేస్తున్నాడు. సిరిష్ ప్రస్తుతం ఇద్దరు దర్శకులతో చర్చలో ఉన్నాడు. స్క్రిప్ట్ చర్చలలో కూడా పాల్గొంటున్నాడు. గీతా ఆర్ట్స్‌లో ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి. తాజా సమాచారం ఏమిటంటే, అల్లు అరవింద్ ఈ రెండు సినిమాలను నిర్మించబోతున్నారు. మరి ఇంత గ్యాప్ తీసుకోని ప్లాన్ చేసుకుంటున్న సిరిష్ కు మంచి హిట్ పడుతుందేమో చూడాలి.