
కరోనా మహమ్మారి కారణంగా ఒకొక్కరు ఒక్కోదాన్ని మిస్ అవుతున్నారు. ఒకరు సినిమాలు చూడటం అయితే మరొకరు సినిమాలు తీయటం. ఒకరు బయటికి వెళ్లి స్నేహితులను కలవడం అయితే మరొకరు జిమ్ లకు వెళ్లి వర్కౌట్ చేయటం. ఈ జాబితాలో అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ కూడా ఉన్నాడట. కానీ అయన వర్కౌట్ చేయటం కాదట జిమ్ లో ఉన్న అద్దాలను మిస్ అవుతున్నాడట. 2013లో 'గౌరవం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లు శిరీష్ ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు ప్రయతినిస్తున్నాడు. మరి కనీసం తన తదుపరి సినిమాతోనైనా హిట్ కొడతాడో లేదో చూడాలి.