
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలందరూ ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు. ఇక అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ఏ స్థాయిలో ఉన్నాడో వేరే చెప్పాల్సిన పని లేదు. స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కానీ అల్లు కాంపౌండ్ నుంచి వచ్చిన అల్లు శిరీష్ కు మాత్రం ఇంకా కాలం కలిసి రావట్లేదు. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ లేదు. శ్రీరస్తు శుభమస్తు సినిమా మినహ శిరీష్ కెరియర్ లో మరే సినిమా హిట్ అవ్వలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రీమేక్‌ల భాట పట్టాడు. రీమేక్ చిత్రమైన ఏబీసీడీ విజయం సాధించలేకపోయినప్పటికి మంచి రీమేక్ పడితే హిట్ వస్తుందనే నమ్మకంతో బెల్లంకొండ శ్రీనివాస్ కు 'రాక్షసుడు' రీమేక్ సినిమా తో హిట్ ఇచ్చిన దర్శకుడు రమేష్ వర్మతో తన కొడుకు శిరీష్ కోసం ఒక రీమేక్ కధను సిద్ధం చేయమని చెప్పాడట అల్లు అరవింద్. మరి అంతా సెట్ అయ్యి శిరీష్ కు హిట్ వస్తుందేమో చూడాలి.