
ఇంతకుముందు దర్శకుడు ఎఎల్ విజయ్ ను వివాహం చేసుకున్న దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటి అమలా పాల్ అతనితో విడిపోయి చాలా కాలం అయింది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఎవరితోనో ప్రేమలో ఉంది. ఇప్పుడు, అమలా పాల్ యొక్క ప్రియుడు పేరుతో సహా అతని ఫోటోలు కూడా రివీల్ అయ్యాయి. అతను మరెవరో కాదు, భావ్నీందర్ సింగ్. ఈ ప్రేమ పక్షులు ప్రస్తుతం లివ్-ఇన్ రిలేషన్ లో ఉన్నారు. భావ్నీందర్ సింగ్ ముస్లిం, నటి అమలా పుట్టుకతోనే క్రైస్తవురాలు, కానీ ఇప్పుడు ఇద్దరు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. ఏదేమైనా, ఫోటోలను చూస్తే ప్రేమికులకు మతం పట్టింపు ఎం లేదని, ఒకరికొకరు నమ్మకాలను గౌరవిస్తారని స్పష్టమవుతుంది. సోషల్ మీడియా సైట్లలో వారి పోస్ట్లు మరియు ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్న విధానం చూస్తే వారు ప్రేమలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. భావ్నీందర్, అమలా "ఆడై" విడుదల సమయంలో, “నా లవ్, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇలానే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండు" అని పబ్లిక్ గా పోస్ట్ చేశాడు.