
నటి అమలా పాల్ గురించి ఎవరికి ప్రత్యేకించి అవసరం అక్కర్లేదనుకుంటా. తెలుగులో సినిమాలు తక్కువే అయినప్పటికీ గుర్తింపు బాగానే వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం మిగితా స్టార్ హీరోయిన్ల మాదిరిగానే డిజిటల్ దునియాలోకి వెబ్ సిరీస్ ద్వారా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆమె నటించబోయే వెబ్ సిరీస్ లో అమలా పాల్ ది బోల్డ్ పాత్ర అని టాక్. ఇది అటు తమిళంతో పాటు తెలుగులో కూడా రూపొందుతుందట. ఈ సిరీస్ కథ 1970ల కాలంలో నడుస్తుందని, పాత నవల ఆధారంగా తెరకెక్కనున్నదని తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్లు ఎప్పుడు మొదలవుతాయో తెలియని నేపద్యంలో నటులు, నిర్మాతలు, దర్శకులు డిజిటల్ బాట పడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.