
కరోనా మహమ్మారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యాప్తి చెందుతుందనడానికి పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య, సెలెబ్రెటీలు కూడా దీని భారిన పడటమే నిర్దర్శనం. అయితే మొన్నీమధ్య బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో సహా వారి కుటుంబంలో ఐదుగురు కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. వారిలో తాజాగా ఐశ్వర్య రాయ్ ఆమె 8ఏళ్ల కూతురుకు కరోనా నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక ఇప్పుడు అమితాబ్ బచ్చన్ 23రోజుల పాటు కరోనాతో పోరాడి, నెగిటివ్ అని నిర్ధారణ కావడంతో ముంబై నవనాతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక జూనియర్ బచ్చన్ అభిషేక్ కు పాజిటివ్ రావటంతో ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు.