రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న బిగ్-బడ్జెట్ మాగ్నమ్ ఓపస్ 'ఆర్ఆర్ఆర్' డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద డివివి చేత 300 కోట్ల రూపాయల బడ్జెట్లో నిర్మించబడుతోంది. సినీ పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్లను సంప్రదించాలని ఆలోచిస్తున్నారట. ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రాజమౌళి మహేష్ బాబు అయితే బాగుంటుందని భావిస్తున్నారట. అలానే అమితాబ్ బచ్చన్ హిందీ వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తమిళ, మలయాళ వెర్షన్లకు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సూపర్ స్టార్స్‌ను సంప్రదించాలని రాజమౌళి ఆలోచిస్తున్నారట. ఇదే కనుక నిజమైతే సినిమాకు మరింత హైప్ రావటం గ్యారెంటీ.