
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. వైరస్ ఎటునుంచి ఎలా వస్తుందో తెలియని పరిస్థితి. మన చేతుల్లో ఉన్నదల్లా జాగ్రత్తలు తీసుకుంటూ బోతిక దూరం పాటించాలి. మహామహులు సైతం ఈ వైరస్ భారిన పడుతున్నారు. తాజాగా బాలీవడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ కరోనా భారిన పడ్డారు. 'నాకు కారోనా పాజిటివ్ అని తేలింది. నేను ఆసుపత్రిలో చేరాను. గత 10 రోజులుగా నాతో బౌతికంగా దగ్గరగా ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్న' అంటూ బిగ్ బి ట్విట్టర్ ద్వారా తెలిజేశారు. ఈ ట్వీట్ అనంతరం బిగ్ బి కొడుకు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ తేలిందంటూ ట్వీట్ చేయటం జరిగింది. ఈ వార్తతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయింది.