
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో మహేష్ తన తదుపరి సినిమా 'సర్కారు వారి పాట' పరుశురాం దర్శకత్వంలో మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్దీ రోజులకి కరోనా విపత్తు రావటంతో యూనిట్ బ్రేక్ ఇచ్చింది. ఈలోగా సినిమాకు సంబంధించిన రోజుకో పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజా పుకారు ఏంటంటే...సర్కారు వారి పాటలో సెకండ్ లిడ్ గా చేయమని బాలీవుడ్ భామ అనన్య పాండేను డైరెక్టర్ పరుశురాం అడిగి, కధ కూడా చెప్పాడట. కధ నచ్చింది కానీ ఇంకా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. మరి ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన 'ఫైటర్' సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న అనన్య మహేష్ సినిమాకు పచ్చ జెండా ఉపుతుందో లేదో చూడాలి.