
బాబర్ధస్త్ కామెడీ షో ద్వారా హాట్ యాంకర్ గా మంచి పేరు, క్రేజ్ తెచ్చుకుంది అనసూయ. బుల్లితెర నుండి క్షణం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం'లో రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచ్చింది. కొన్ని అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అందులో అనసూయ నటన చూసిన దర్శకులు ఆమెకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ సినిమాలో, కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి సినిమాలో ఆమె అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా కాలానికి తెరక్కెక్కిస్తున్న 'రంగమార్తాండ' చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణల కూతురుగా ఆమెకు ముఖ్య పాత్రను ఆఫర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ ఓరికి వెళ్లనుంది.