
బుల్లితెరపై తనదైన రీతిలో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు బిజీ బిజీగా కాలి సమయం లేకుండా గడుపుతుంది యాంకర్ అనసూయ. బుల్లితెరపై అనసూయ అందాలు ఎలా ఆరబోస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు వెండితెరపై అనసూయ చాలా బిన్నం. అందానికి కాదు అభినయానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానంటూ తన వద్దకు వచ్చిన పాత్రల్లో ఆచితూచి ఎంచుకుంటుంది. అల..ఎంచుకుంటుంది కాబట్టే రంగమత్తగా, సిసలైన పోలీస్ ఆఫీసర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా 'థాంక్ యు బ్రదర్' అనే సినిమాలో గర్బత్తిగా అనసూయ నటిస్తుందని తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఇప్పుడు అందరికి షాక్ ఇస్తూ మరో భిన్నమైన పాత్రలో ఆమె మెరవనుంది. సిల్క్ స్మిత బయోగ్రఫీలో అనసూయ నటిస్తోంది. మరో మంచి కథలో జీవిస్తున్నాను. కొత్త ప్రయాణం ప్రారంభించాను అంటూ ఓ లుక్ను షేర్ చేసింది. అందులో సిల్క్ స్మితను ఆధారంగా చేసుకుని ఈ లుక్ను డిజైన్ చేశారు అని చెప్పుకొచ్చింది. అచ్చు గుద్దినట్లు సిల్క్ స్మితను చూసినట్లే అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.