
ఎంతో చాలకాగి నవ్వుతూ నవ్విస్తూ బుల్లితెరపై అందరిని ఎన్నో ఏళ్ల పాటు అలరించిన యాంకర్ లాస్య పెళ్లి తర్వాత బుల్లితెరకు దూరమైంది. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా అందరి ముందుకు వచ్చింది. అయితే లాస్య నవ్వుల వెనుక ఎన్నో బాధలు ఉన్నాయని బిగ్ బాస్ ద్వారానే తెలుస్తోంది. తాజాగా ఓ ఎపిసోడ్ లో తన జీవితంలో మర్చిపోలేని పలు సంఘటనలను పంచుకుంది. "2010లోనే మాకి పెళ్లైంది కానీ ఎవరికి తెలియదు....2012 నుంచి మేము కలుసున్నాం. మా నాన్న 2014లో ఫోన్ చేసి మీరు సెటిల్ అయ్యాక నేనే అందరి సమక్షంలో మీ పెళ్లి చేస్తా అన్నారు. అప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వెళ్తే నేను ప్రెగ్నెంట్ అన్నారు. కానీ మా నాన్న మాటలు గుర్తొచ్చి ప్రెగ్నెన్సీ తీయించుకున్నాను. 2017లో మాకు అందరి సమక్షంలో పెళ్లయింది. 5 నెలలకు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను కానీ మిస్ క్యారెజ్ అయింది. 2018లో మళ్ళీ జున్ను గాడు కడుపులో పడ్డాడు" అని తన బాధను వెళ్లగకింది. ఇది విన్న వారంత చిరునవ్వు వెనుక ఇంత బాధ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.