
బుల్లితెరపై యాంకర్ అనగానే అందరికి గుర్తొచ్చే పేరు సుమ. సుమ కాకుండా ఎవరు అంటే చాలామందికి శ్రీముఖి పేరే వస్తుంది. తన అల్లరి చేష్టలతో కొంటె మాటలతో భిన్నమైన షోలతో ప్రేక్షకులను ఎప్పుడు అలరిస్తుంటుంది. అందుకే యాంకర్ గా మంచి సక్సెస్ అందుకుంది. రియాల్టీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 3 లో టాప్ 2 లో నిలిచి వారేవా అనిపించుకుంది. అయితే తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో 'న్యూ బిగినింగ్స్' అంటూ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను పెట్టింది. ఇంతకీ ఆ బిగినింగ్ ఏమిటి అనుకుంటున్నారా? శ్రీముఖి సొంతూరు అయిన నిజామాబాద్ తో సొంతింటి కలను నెరవేర్చుకుంటుంది. సొంత ఇంటి నిర్మాణానాన్ని పూజతో మొదలు పెట్టారు. ఈ సందర్బంగా ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకుంది.