
బుల్లితెరపైనే కనిపించేది కానీ వెండితెర స్టార్లకు ఉన్నంత క్రేజ్, అంతమంది అభిమానులు ఉన్నారు. మళ్ళీ బుల్లితెర యాక్టర్ కాదు యాంకర్. ఆమె....ఎవర్ గ్రీన్, ఎనర్జిటిక్ సుమ కనకాల. అయితే మొన్నీమధ్య నుంచి సుమ ఆమె భర్త రాజీవ్ కనకాల తెరపై ఎక్కువ కనిపించకపోవటంతో వీళ్ళు విడిపోయారంటూ రూమర్లు విపరీతంగా పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా ఈటీవీలో ప్రసారమౌతున్న క్యాష్ ప్రోమోతో రూమర్లకు చెక్ పెట్టింది సుమ. తన భర్త రాజీవ్‌తో కలిసి వాళ్లు ఎంత అన్యోన్యంగా ఉన్నారో.. ఉంటున్నారో చెప్పకనే చెప్పింది. సఖి సినిమాలో రొమాంటిక్ సాంగ్‌తో ఈ ఇద్దరూ బ్యూటిఫుల్ ఎంట్రీ ఇవ్వగా.. ప్రేక్షకుల్ని ఆటపాటలతో కనువిందు చేశారు. ఇది కేవలం బయట దుమారం రేపుతున్న రుమర్లకు చెక్ పెట్టేందుకు సుమనే ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా పుకార్లు పుట్టించిన నోర్లకు గట్టిగానే గొళ్ళెం పెట్టేసింది యాంకర్ సుమ.