
టిక్ టాక్ జనాల్లోకి ఎంతలా వెళ్లిపోయిందంటే అందులో చిలిపి పనులు, తింగర మాటలు, డ్యాన్స్ లు, డైలాగ్లు, మిమిక్రి, వెకిలి చేష్ఠలు ఇలా ఏమి చేసినా సరే యిట్టె ఫెమస్ అవుతున్నారు. సరదాగా ఉందని చూస్తూ వాళ్ళను సెలెబ్రిటీలను చేస్తున్నారు. టివి ఛానెల్స్ సైతం వాళ్ళను గుర్తించి ప్రోగ్రాములకు పిలుస్తున్నారంటే ఎంత ఫెమస్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే...అల టిక్ టాక్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పిల్లి ఇప్పుడు ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవి లో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ డ్యాన్స్ షో 'ఢీ' సీజన్ 13 లో రష్మీతో కలిసి మరొక యాంకర్ గా కనిపిస్తుంది. టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఇప్పుడు బుల్లితెరపై అది కూడా అంతటి పెద్ద స్టేజ్ పై కనిపించటం నిజంగానే గొప్ప విషయం.