
అఖిల్ కు ఇప్పటి వరకు సరైన హిట్ లేకపోవడంతో చాలా గ్యాప్ తీసుకోని సరైన కధ కోసం ఎదురుచూసి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 4వ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ చిత్ర టైటిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" గా నిర్మాతలు తాజాగా విడుదల చేశారు. హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ సాధించిన అఖిల్, గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై తన ఆశలన్నింటినీ పెట్టుకున్నాడు. అఖిల్ చేసిన మూడు సినిమాలు- అఖిల్, హలో, మిస్టర్ మజ్ను బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో నాగార్జున అఖిల్ కు ఎలాగైనా హిట్ పడాలనే తాపత్రయంతో పెద్ద డైరెక్టర్లను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన దర్శకుడు అనిల్ రావిపూడిను సంప్రదించి అఖిల్ తో సినిమా తీయమని మంచి డీల్ ఇచ్చారట. దీంతో అనిల్ తాను కమిట్ అయిన F3 సినిమాను ముగించి ఆ తర్వాత అఖిల్ తో సినిమా తిస్తానని అనిల్ నాగ్ కు మాట ఇచ్చారట. మరి అఖిల్ కు అనిల్ అయిన హిట్ ఇస్తారో లేదో చూడాలి.